నెక్స్ట్ ఆ స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నఅనుదీప్…

జాతి రత్నాలు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ అనుదిప్ ఈయన తీసిన ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా కూడా కామెడీ ప్రదానం గా సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలించింది.

ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి కూడా ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు.

అలా ఈ సినిమాని తీసిన అనుదిప్ ఆ తర్వాత తమిళ్ స్టార్ హీరో అయిన శివ కార్తికేయన్ ని హీరో గా పెట్టీ ప్రిన్స్ అనే మూవీ తీశారు ఈ సినిమా కూడా కామెడీని బేస్ చేసుకొనే నడుస్తుంది.

"""/" / అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా మాత్రమే ఆడింది దీంట్లో శివకార్తికేయన్ యాక్టింగ్ బాగుంది కానీ సినిమా మొత్తం ఒక టైప్ ఆఫ్ కామెడీ తో మిక్స్ అయి ఉండడం వల్ల ఎమోషనల్ సీన్ ఏదో కామెడీ సీన్ ఏదో జనాలకి అర్థం కాకుండా పోయింది.

అలా సినిమా మొత్తం ఫుల్ ఫన్ తో సాగుతుంది.అయితే ప్రస్తుతం తెలుస్తున్న న్యూస్ ఏంటంటే అనుదిప్ విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఆ సినిమాకి సంభందించిన కథ మీదనే అనుదిప్ వర్క్ చేస్తున్నట్టు గా కూడా తెలుస్తుంది.

"""/" / అయితే వెంకటేష్ కూడా ఫుల్ కామెడీ ఉన్న రోల్ చేసి చాలా రోజులు అవుతుండడం తో అనుదిప్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఒకవేళ అనుదిప్ తన సినిమా తో వెంకటేష్ కి మంచి హిట్ ఇవ్వగలిగితే అనుదిప్ ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.

ప్రస్తుతం వెంకటేష్ శైలేష్ కొలను డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత అనుదిప్ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభం..