అను ఇమ్మాన్యుయేల్ కి మరో రెండు ఆఫర్లు..!
TeluguStop.com
ఊర్వశివో రాక్షసివో మూవీ తో సూపర్ హిట్ అందుకున్న అను ఇమ్మాన్యుయేల్.ప్రస్తుతం వరుస ఆఫర్లు అమ్మడి తలుపుతడుతున్నాయి.
మలయాళ మూవీ యాక్షన్ హీరో బీజుతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మాన్యుయేల్.
ఆ తరువాత నేచురల్ స్టార్ నాని సరసన మజ్ను సినిమాలో నటించింది.ఈ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
విరించి వర్మ రూపొందించిన ఈ మూవీతో తెలుగులో తొలి హిట్ ని అందుకుంది.
ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించినప్పటికీ అవేమి కూడా విజయాలు సాదించకపోవడం తో అవకాశాలు తగ్గాయి.
తాజాగా అల్లు శిరీష్ సరసన ఊర్వశివో రాక్షసివో మూవీ లో నటించింది.ఈ మూవీ లో గ్లామర్ డోస్ తో పాటు హాట్ హాట్ లిప్ లాక్ లు చేసి యూత్ కు కిక్ ఇచ్చింది.
ఈ సినిమా సక్సెస్ సాధించడం తో మళ్లీ నిర్మాతల కన్ను ఈ భామ ఫై పడుతున్నాయి.
ఈ భామ కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న జపాన్ మూవీ లో ఛాన్స్ కొట్టేసింది.
రీసెంట్ గా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఇవే కాకుండా ఎన్.
టి.ఆర్, కొరటాల శివ సినిమాతో పాటుగా మహేష్, త్రివిక్రం కాంబో మూవీకి కూడా అను ని సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటున్నారని టాక్.
మొత్తం మీద మళ్లీ అనుకు వరుస ఛాన్సులు వస్తుండడంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మీడియా ముందుకు వస్తే తప్ప ఇచ్చిన మాట గుర్తు లేదా దేవర.. ఎన్టీఆర్ సాయం పై విమర్శలు!