గురకను తగ్గించే తలగడ గురించి మీకు తెలుసా?

గురక రావడం ప్రస్తుత రోజుల్లో పెద్ద సమస్యగా మారింది.ఈ గురక పెట్టడం వల్ల సమస్య ఉన్న వారి కంటే పక్కన నిద్రపోయే వారికి అతి పెద్ద సమస్యగా మారుతుంది.

ఈ సమస్య వల్ల ప్రతిరోజు నిద్ర లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

అయితే గురక పెట్టడం వంటి సమస్యతో బాధపడేవారికి ఓ ప్రముఖ సంస్థ ఒక శుభవార్తను చెప్పింది.

తమ సంస్థ తయారు చేసే తలగడను వాడటం ద్వారా ఈ గురక సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని తెలియజేసింది.

సాధారణంగా కొంతమందికి తలగడ అలవాటు లేకపోవడంతో ఫ్లాట్ గా పడుకొని ఉండటం వల్ల ముక్కులోని శ్వాసకోశ రంధ్రాలు పూర్తిగా మూసుకు పోవడంతో ఈ గురక అనేది వస్తుంది.

అలాంటి వారి కోసమే ఈ‘మ్యాట్రిక్స్ పిల్లో’ రూపొందించామని, ఆ సంస్థ తెలియజేసింది.ఈ తలగడ తయారు చేసేటప్పుడు ఇందులో రెండు లేయర్ల మిశ్రమంతో పాటు, మరింత సౌకర్యంగా ఉండేందుకు మెమొరీ ఫోమ్ ఉపయోగించినట్లు ఈ సంస్థ పేర్కొంది.

"""/" / అంతేకాకుండా ఈ ప్రత్యేకమైన తలగడలో 14 క్యూబ్ లను ఉపయోగించి తయారు చేయటం వల్ల ఎటువైపు తిరిగి పడుకున్నా ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల గురుక వచ్చే సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుందని మ్యాట్రిక్స్ పిల్లో సంస్థ పేర్కొంది.

అంతేకాకుండా ఈ తలగడను ఉపయోగించడం ద్వారా హాయిగా నిద్ర పట్టడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసి మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఈ సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం ఈ తలగడలు కేవలం యూకే లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ఇంతటి ప్రత్యేకమైన ఈ పిల్లో ధర 59 పౌండ్లు, అంటే భారతదేశ కరెన్సీలో దాదాపు రూ.

5821.

వైసీపీకి రిపేర్లు మొదలుపెట్టిన జగన్