యాంటీ రేడియేషన్ మిసైల్ .. రుద్రం ప్రయోగం సూపర్ సక్సెస్ !

భారత దేశం రక్షణ రంగం రోజులు గడిచే కొద్ది మరింత బలంగా మారుతుంది.

తాజాగా శత్రు దేశాల రాడార్లను క్షణాల్లో మట్టి కరిపించే క్షిపణిని విజయవంతం గా పరీక్షలు జరిపింది.

ఈ మిస్సైల్ ను సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.ఇది శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను క్షణాల్లో దెబ్బ కొట్టగలదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మిస్సైల్ శబ్ద వేగం కన్నా రెట్టింపు వేగంతో ముందుకు దూసుకుపోతుంది.

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అధికారి ఒకరు చెప్పిన వివరాల ప్రకారం, వ్యూహాత్మక యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం ని డీఆర్‌డీవో శుక్రవారం ఉదయం 10.

30 గంటలకు పరీక్షించగా , అందులో ఆ మిస్సైల్ విజయం సాధించింది.ఒడిశాలోని బాలాసోర్ నుంచి దీనిని ప్రయోగించారు.

భారత వాయు సేన సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగలిగే ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బ తీస్తుంది.

ఈ రుద్రం మిసైల్‌ తో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయగలిగే కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం వాయు సేనకు వచ్చింది.

భారత వాయు సేన నిరాటంకంగా, సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలవుతుంది.యుద్ధ విమానం ప్రయాణించే ఎత్తునుబట్టి ఈ మిసైల్ పరిథి ఆధారపడి ఉంటుంది.

కనిష్టంగా 500 మీటర్ల ఎత్తు నుంచి, గరిష్ఠంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీనిని ప్రయోగించవచ్చు.

250 కిలోమీటర్ల పరిథిలో రేడియేషన్‌ ను వెలువరించే లక్ష్యాన్ని ఛేదించవచ్చు.ఫైనల్ గా ఈ రుద్రం భారత దేశపు మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ కావడం విశేషం.

ఏపీలో పెన్షన్ కష్టాలు.. చంద్రబాబుకు బుద్ధి చెబుతామంటున్న ప్రజలు