కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారుల దురాగతం, హిందూ ఆలయంలో భారత్‌పై పిచ్చిరాతలు
TeluguStop.com
కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు రెచ్చిపోయారు.ఏకంగా హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి.
ఆలయ గోడలపై భారత్‌కు వ్యతిరేకంగా పిచ్చిరాతలు రాశారు.ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.టొరంటోలోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరంలో ఈ ఘటన జరిగింది.
దీనికి సంబంధించి కెనడాలోని భారత హైకమీషన్ బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించింది.భారత వ్యతిరేక గ్రాఫిటీతో స్వామి నారాయణ్ మందిర్‌ను అపవిత్రం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కమీషన్ తెలిపింది.
ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్తులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను భారత హైకమీషన్ కోరింది.
ఇండో కెనడియన్ పార్లమెంట్ సభ్యుడు చంద్య ఆర్యా కూడా ఈ ఘటనపై స్పందించారు.
టొరంటోని స్వామి నారాయణ్ మందిరాన్ని ధ్వంసం చేయడాన్ని అందరూ ఖండించాలని ఆయన కోరారు.
ఇటీవలి కాలంలో కెనడాలోని హిందూ దేవాలయాలను ద్వేషపూరిత నేరాలకు లక్ష్యంగా చేసుకున్నారని చంద్ర ఆర్యా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రాంప్టన్ సౌత్ పార్లమెంట్ సభ్యురాలు సోనియా సిద్ధూ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. """/" /
ఇకపోతే.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హిందూ దేవాలయాల్లో చోరీలు జరగడంతో గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని హిందూ సమాజం భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే.
హిందూ ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ చోరీలు, విధ్వంసక చర్యల దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో హిందూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బ్రాంప్టన్‌లోని భారత మాతా మందిర్, మిస్సిసాగాలోని రామమందిరం , బ్రాంప్టన్‌లోని శ్రీహనుమాన్ మందిరం, చింత్‌పూర్ణి మందిర్, గౌరీ శంకర్ మందిర్, జగన్నాథ దేవాలయం, హిందూ హెరిటేజ్ సెంటర్, హామిల్టన్‌లోని సమాజ్ ఆలయంలో ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?