కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది.. ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని ఆరోపించారు.

సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు.

ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు.

అదేవిధంగా హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని కవిత దుయ్యబట్టారు.ఈ క్రమంలోనే తెలంగాణలో హామీల అమలుకు కొంత సమయం ఇస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : తమిళనాడులోని ఆ గ్రామంలో పండుగ వాతావరణం