బోయిన్ పల్లి లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్ పల్లి ఎస్సై పృథ్విధర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ తమవంతు కృషి చేయాలని, ముఖ్యంగా యువత మత్తుకు భానిస కాకూడదని, తల్లిదండ్రులు తమ భాద్యతగా పిల్లలకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి పోలీస్ సిబ్బంది,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధాకర్, జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె.

భూమయ్య,సిఆర్పీ లు జాగిరి శ్రీనివాస్, విద్యార్థులు, మండలంలో నీ యువత, ప్రజలు పాల్గొన్నారు.

5 లక్షల నుంచి నాలుగు రోజుల్లో 500 కోట్ల కలెక్షన్ల స్థాయికి ఎదిగిన ప్రభాస్.. ఏం జరిగిందంటే?