కోదాడలో ప్రజాస్వామ్య విరుద్ధంగా పరిపాలన…!

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతలమని గొప్పలు చెప్పుకుంటున్న నేతల పని తీరుకు పట్టణంలోని 18వ,వార్డు అద్దం పడుతుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు గణేష్ నగర్ లో డ్రైనేజీ కోసం ఇండ్ల ముందు తీసి పూడ్చకుండా వదిలేసిన గుంతలను అయన పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా తీసిన గుంతల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని మున్సిపల్ అధికారులు విడనాడాలని సూచించారు.

అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నేత ఒత్తిడితో డ్రైనేజీ నిర్మించకపోవడం ప్రజాస్వామ్య పరిపాలనకు విరుద్ధమని అన్నారు.

మున్సిపల్ అధికారులు వేలాది రూపాయల ఇంటి పన్నులు కట్టించుకుంటూ పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.

రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేయాల్సిన అధికారులు ప్రజా ప్రతినిధుల జోక్యంతో అభివృద్ధిని నిలిపివేయడం సరికాదన్నారు.

డ్రైనేజీలు నిర్మించకపోతే బీఎస్పీ ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి,వార్డు ప్రజలు, బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

కార్తీ సత్యం సుందరం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?