'అంటే సుందరానికి' ట్రైలర్ అప్డేట్.. లీలా, సుందర్ అద్భుతమైన జర్నీ కోసం గెట్ రెడీ..
TeluguStop.com
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరు సినిమాలు నాలుగు హిట్లు అన్నట్టుగా సాగుతుంది.
నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.
ఈ సినిమా హిట్ తో నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.మధ్యలో ప్లాప్స్ తర్వాత హిట్ పడడంతో ఈ సినిమాతో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు.
ప్రెసెంట్ నాని అంటే సుందరానికి, దసరా సినిమాలతో బిజీగా ఉన్నాడు.అంటే సుందరానికి సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక ఈయన రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంచాడు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఒక అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో అనే దానిపై అప్డేట్ ఇస్తూ ఒక పోస్ట్ చేసారు.
ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో అని మే 30 ఉదయం 11 గంటల 7 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.
జూన్ 10న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించింది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాలు నిర్మించారు.తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపారు.
ఇక ప్రెసెంట్ నాని దసరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. """/" /
శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కే 'దసరా' సినిమాలో ఇప్పటి వరకు నాని ని చూడని కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా కనిపించ నుంది.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.