సగటు కృష్ణ అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలు ..కాస్త సమాధానం చెప్పండి మాస్టారు !

ఇది జ్ఞానం తో కూడిన అజ్ఞానం తో అడుగుతున్న ప్రశ్న అనుకోండి లేకపోతే ఆవేదనతో కూడిన ప్రశ్న అనుకున్న సరే.

ఎవరైనా ఒకసారి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసాక, ఆ చోట కాకుండా మరెక్కడో కడితే అది సమాధి ఎలా అవుతుంది.

మన హిందూ ధర్మాలలో అంత్యక్రియలు రెండు రకాలు.ఒకటి దహనం, రెండోది ఖననం.

దహనం చేసినట్టయితే అస్థికలను ఆ చోట కలెక్ట్ చేసుకొని ఏదైనా నదిలో వాటిని కలిపేస్తారు.

లేదంటే కొంత మంది తమ సొంత స్థలాల్లో దహనం చేస్తే ఆ అస్థికలను, బూడిదను అక్కడే ఒక సమాధిలాగా కట్టి దానిని ఒక స్మారకంగా మార్చుకొని అప్పుడప్పుడు నివాళులు అర్పిస్తారు.

ఇటీవల మరణించిన పునీత్ రాజ్ కుమార్ కి తన సోదరులు ఇలాగే స్మారకాన్ని ఏర్పాటు చేస్తే లక్షల్లో అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు.

ఇక ఎన్టీఆర్ చనిపోయిన కూడా అక్కడే సమాధి కట్టి స్మారకాన్ని ఏర్పాటు చేస్తే జయంతి, వర్ధంతి కి కుటుంబం, అభిమానులు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

ఇక అక్కినేని కి ఎలాంటి స్మారకం, సమాధి రెండు లేవు.ఇక మహేష్ బాబు కృష్ణ చనిపోయిన రోజు నుంచి వింతగా ఆలోచిస్తూ ఎవరికీ అర్ధం కానీ నిర్ణయాలు తీసుకుంటూ గందరగోళం సృష్టింస్తున్నాడు.

ఇప్పుడు మహా ప్రస్థానం లో దహనం చేసిన కృష్ణ అస్థికలను ఆల్రెడీ నదిలో కలిపేసాడు.

"""/"/ మళ్లి స్మారకం, సమాధి కడుతాం అంటూ కృష్ణ తమ్ముడు అది శేషగిరి రావు వ్యాఖ్యలు చేయడం విడ్డూరం గా వుంది.

ఇక పోతే వందల ఎకరాల్లో స్థలం ఉన్న కూడా జగన్ స్థలం ఇస్తే కానీ స్మారకం కట్టలేరా ? ఇది కృష్ణ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న.

తెలంగాణాలో కేసీఆర్ జాగా ఇస్తే కృష్ణ జ్ఞాపకాలను ఒక చేట చేర్చి స్మారకంగా మెమోరియల్ కడతాం అంటున్నారు.

సొంత స్థలంలో దహనం చేయడం కుదరలేదు కానీ ఈ సమాధిని ఏం అనాలి మహేశా ? జరా ఆలోచించు.

ఇప్పటికి అయినా పక్కన వాళ్ళ మాటలు కాకుండా నీ తండ్రి కోసం ఏదైనా నువ్వే చేయాలి అటు అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

తెలుగులో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్న మోహన్ లాల్…