ఆ సినిమాకి ఒప్పుకొని తర్వాత చేయనని నిర్మాతకు షాకిచ్చిన ఏఎన్నార్..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌లు, సూపర్‌హిట్లు సాధించడం అంత సులభమైన విషయమేమీ కాదు.హీరో మంచి కథను సెలెక్ట్ చేసుకుంటే హిట్ సాధిస్తాడు.
చాలా సందర్భాల్లో స్టార్ హీరోలకు ఒక సినిమా మొదలైన వెంటనే దాని రిజల్ట్ ఏంటనేది అర్థమైపోతుంది.
అలా సినిమాని కరెక్ట్‌గా జడ్డ్ చేయగలిగిన హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు,( Akkineni Nageswara Rao ) కృష్ణ( Krishna ) కూడా ఉన్నారు.
షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీళ్లు సినిమా సక్సెస్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే దాని గురించి దర్శకనిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పేవారు.
కృష్ణ ముందుగా చెప్పినట్టుగానే సినిమాలు హిట్/ఫ్లాప్ అయ్యేవి.కొంతమంది హీరోలు తాము చేసే సినిమా కచ్చితంగా హిట్ కాదని, దాని నుంచి తప్పుకుంటారు.
ఇప్పట్లో చాలామంది అలానే చేస్తున్నారు.కానీ ఏఎన్నార్ మాత్రం తన 70 ఏళ్ల కెరీర్‌లో కేవలం ఒక్క సినిమా విషయంలోనే అలా చేశారు.
అది కూడా ఆ సినిమా పాత్ర తనని ఎంతగానో ఇబ్బంది పెట్టింది.ఇంతకీ ఏంటా సినిమా? ఏ కారణం చేత ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు? అనేది తెలుసుకుందాం.
"""/" /
ఏఎన్నార్ కెరీర్ మొత్తంలో 255కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు.
ఆయన కెరీర్‌లో షూటింగ్ ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన సినిమా జస్ట్ ఒకటి మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు.
సినిమాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏఎన్నార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవారో దీన్ని బట్టి అర్థమవుతోంది.
ఇక ఆయన మధ్యలోనే తప్పుకున్న ఒకే ఒక సినిమా పేరు ‘సదారమ’.( Sadarama Movie ) ఇది ఏవీయం సంస్థ నిర్మాణంలో మూడు రోజుల షూటింగ్ కూడా జరుపుకుంది.
అయితే ఏఎన్నార్ ఆ సినిమా ఒప్పుకున్నందుకు, అందులోని క్యారెక్టర్‌కు కమిట్ అయినందుకు చాలా బాధపడిపోయారు.
ఎందుకంటే ఇందులో ఏఎన్నార్‌కు దొంగ పాత్ర ఇచ్చారు.సినిమా కథ చెప్పినపుడు ఆయనకు చాలా నచ్చింది కానీ దొంగ వేషం వేసినప్పుడు మాత్రం ఇబ్బందిగా అనిపించింది.
"""/" /
మూడో రోజు షూటింగ్ నాటికి ఆ దొంగ వేషం మీద ఆయనకు బాగా కంపరం పుట్టింది.
ఒకవేళ ఆ దొంగ మంచివాడుగా మారి హీరో క్వాలిటీస్ సంపాదిస్తాడా అంటే అదీ లేదు.
ఈ సినిమా చివరి వరకు ఏఎన్నార్ ది నెగెటివ్ దొంగగానే ఉంటుంది.ఈ సినిమా చేస్తే తనకున్న పేరు మొత్తం పోతుందని ఆయన భయపడ్డారు అందుకే నాలుగో రోజు షూటింగ్‌కి డుమ్మా కొట్టారు.
మళ్లీ తాను ఎందుకు ఈ సినిమా చేయలేకపోతున్నానో వివరించాలని ఏవీయం ఆఫీస్‌కి వెళ్లారు.
‘సదారమ సినిమాలోని పాత్ర నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది.నన్ను అలాంటి క్యారెక్టర్‌లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరని నాకు తెలుసు.
సినిమా ఇంకా ఎక్కువగా షూటింగ్ జరుపుకోలేదు కాబట్టి వేరెవరినైనా ఆ క్యారెక్టర్ కు సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పటివరకు ఎంత ఖర్చయిందో అంతా నేను భరిస్తాను.ఈ మూవీ చేయడం మాత్రం నావల్ల అయ్యే పని కాదు’ అని నిర్మాత ఎ.
వి.మెయ్యప్పన్‌కు( Producer AV Meiyappan ) వెల్లడించారు.
"""/" /
అయితే ఆ నిర్మాత మాత్రం ఏఎన్నార్ అలా చెప్పడాన్ని అసలు అంగీకరించలేదు.
"పోస్టర్లు వేశాం.డిస్ట్రిబ్యూటర్లు ఈ కథను యాక్సెప్ట్ చేశారు.
వారికి చెప్పి ఈ సినిమా ప్రారంభించాం.మీరు ఇప్పుడు ఇలా సినిమా చేయనని చెప్తే వాళ్ళ దగ్గర మాకు మాట వస్తుంది’ అని బాగా డిసప్పాయింట్ అయ్యాడట.
ఎంత సర్ది చెప్పినా ప్రొడ్యూసర్ ఒప్పుకునేలా లేరని తెలుసుకున్న ఏఎన్నార్ నిర్మాత చక్రపాణి సహాయం కోరారు.
అంతా విన్న చక్రపాణి( Chakrapani ) ఎ.వి.
మెయ్యప్పన్‌కి ఫోన్ చేసి ఏఎన్నార్‌కు పట్టుదల ఎక్కువ అని, ఎవరు చెప్పినా సినిమా చేసే అవకాశం ఉండదని ఆయనకి నచ్చ చెప్పారట చక్రపాణి.
చివరికి నిర్మాత చేసేదేమీ లేక సినిమాని ఆపేశారు.ఆ సినిమాకు అయిన ఖర్చును, పారితోషికాన్ని ఏఎన్నార్ చెల్లించడానికి సిద్ధమయ్యారు కానీ, మెయ్యప్పన్ మాత్రం వాటిని తీసుకోకుండా నెక్స్ట్ మూవీకి అడ్వాన్స్‌గా మీ దగ్గరే ఉంచండి అని అన్నారట.
తరువాత ఆయన తీసిన ‘భూకైలాస్’ సినిమాలో అక్కినేని నారదుడిగా నటించి తాను చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.
భూకైలాస్ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది.
ఇది చాలా లక్కీ కారు అట.. దీనిని మనుషుల మాదిరిగానే ఖననం చేశారుగా..!