వైరల్ అవుతున్న అక్కినేని నాగేశ్వరరావు చివరి మాటలు.. ఆందోళన చెందొద్దంటూ?

అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao) శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏఎన్నార్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి ప్రధానం చేసిన సంగతి తెలిసిందే.

ఈ వేడుక హైదరాబాద్ లో తాజాగా సోమవారం రోజున ఘనంగా నిర్వహించారన్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి సినీ, రాజీకయ ప్రముఖులు హాజరయ్యారు.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వేడుకకు విశేష అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే.

అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డుని ప్రధానం చేశారు.అలాగే ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వరరావు చివరి మాటలను వినిపించారు.

"""/" / అక్కినేని ఫ్యామిలీ( Akkineni Family ) గ్రూప్ లో అక్కినేని నాగేశ్వరరావు చివరిసారి మాట్లాడిన ఆడియోను స్క్రీన్ పై ప్లే చేశారు.

ఆయన మాటలు వింటూ సినీ ప్రముఖులు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.మరీ ఆ ఆడియోలో ఏమి ఉంది అన్న విషయానికి వస్తే.

ఈ ఆడియోను నాగేశ్వరరావు ఐసీయూలో ఉన్నప్పుడు రికార్డ్ చేశారు.ఆయన మాట్లాడుతూ.

నా శ్రేయోభిలాషులు అందరూ నా పట్ల ఎంత శ్రద్ద వహిస్తున్నారో, నా ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారో, నాకు బాగా తెలుసు, నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్‌ ను చెబుతున్నారు.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీరు బాధపడకుండా మిమ్మల్ని సంతోష పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. """/" / నేను బాగానే ఉన్నాను.

రికవర్ అవుతున్నాను.ఎవరూ ఆందోళనలు చెందాల్సిన అవసరం ఏమీ లేదు.

త్వరలోనే బయటకు వచ్చేస్తాను.త్వరలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఆరోగ్యంగా తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు ఏఎన్ఆర్.

మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది నాకు తెలుసు.నా ఆరోగ్యం, నా సంతోషం, ఆస్థి.

నాకు దొరికే ఆశీర్వాదాలే.అని నాకు ప్రగాఢ విశ్వాసం నాకుంది.

అనేక సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.ఇప్పుడు బయటకు వస్తానని నమ్మకం ఉంది.

అది అలాగే కొనసాగాలని, ఆరోగ్యం బాగుండి,ఆప్తులంతా సంతోషపడాలని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను.సెలవ్ మీ ఆశీర్వదామే నాకు ముఖ్యం అని అన్నారు ఏఎన్ఆర్.

ఈ మాటలకూ అక్కడున్న అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ బడ్జెట్ తెలిస్తే మాత్రం వామ్మో అనాల్సిందే!