మరిది పెండ్లిలో వదిన డ్యాన్స్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు
TeluguStop.com
ప్రతి మనిషి జీవితంలో సంబురంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందా అంటే అది ఒక్క పెండ్లి మాత్రమే.
దీన్ని ఎంత గ్రాండ్ గా చేసుకుంటే తమకు అంత మధురమైన అనుభూతి మిగులుతుందని యూత్ భావిస్తోంది.
ఇందులో భాగంగా తమకు నచ్చినట్టు తమ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకుంటోంది.ఒకప్పుడు చాలా సింపుల్ గా జరిగేవి పెండ్లిలు.
కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా.అందుకే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
డ్యాన్సులు, షోలు, ఆట పట్టించడాలు, ప్రాంక్ ఇలా ఎన్నో రకాల ట్రెండింగ్స్ నడుస్తున్నాయి.
అయితే ఇటీవల పెళ్లి అంటేనే డ్యాన్సులు అన్నట్టు తయారయిపోయింది.ప్రతి ఒక్కరి పెండ్లిలో డ్యాన్సు అనేది కామన్ అండ్ మెయిన్ సబ్జెక్టుగా మారిపోయింది.
హాయిగా బంధు, మిత్రులు అందరూ కూడా ఎంచక్కా స్టెప్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసేందుకు దీన్ని ఓ వేదికగా మలుచుకుంటున్నారు.
ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది.అయితే ఇప్పటి వరకు పెండ్లిలో వధువు డ్యాన్స్ చేయడం చూస్తున్నాం.
కానీ ఇప్పుడు కాస్త డిఫరెంట్ గా మరిది పెండ్లిలో ఓ వదిన ఆనందంతో డ్యాన్స్ చేసి అందరినీ కుషీ చేసింది.
ఆమె డ్యాన్స్ తో అంతా ఆశ్చర్యపోయారు.ఎందుకంటే వదిన అంటే మరిది పెండ్లిలో పెద్దలాగా అన్ని పనులు చక్కదిద్దు తుంది కానీ ఇలా డ్యాన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
హమ్ ఆప్‌కే హైకోన్ సినిమాలోని లోచలీ సాంగ్ కు ఆమె చాలా అందంగా డ్యాన్స్ చేసింది.
పెండ్లి మండటపంపై జంట ఉండగానే ఆమె ఇలా డ్యాన్స్ చేయడంతో అంతా ఆనందంతో పొంగిపోయారు.
ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేయడాన్ని అక్కడున్న వారంతా వీడియో తీయగా అది కాస్తా ఇప్పుడు నెట్టింట విపరీతంగా హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఈ పెళ్లి ఏడ జరిగిందో తెలీదు గానీ డ్యాన్స్ వీడియో మాత్రం నెటిజన్లను ఫిదా చేస్తోంది.
ఆ హీరోయిన్ జాతకాన్ని కళ్యాణ్ రామ్ మారుస్తాడా.. ఆ మూవీపైనే ఆశలు పెట్టుకుందిగా?