మరో యుద్ధం.. రష్యాపై అమెరికా దాడికి దిగుతుందా..?
TeluguStop.com
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ ( Ukraine )మధ్య భీకర యుద్దం జరుగుతోంది.ఏడాది కాలంగా ఈ యుద్దం కొనసాగుతూనే ఉంది.
ఈ యుద్దం ఎప్పుడు ముగింపు దశకు చేరుకుంటుందో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఈ యద్దం వల్ల ఆ దేశాల నుంచి వేరే దేశాలకు ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం వల్ల ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది.
అయితే ఈ యుద్దానికి ప్రత్యక్షంగా అగ్రరాజ్యం అమెరికా కూడా కారణమవుతుంది.ఉక్రెయిన్ ను అమెరికా మరింతగా రెచ్చగొట్టి రష్యాపై ఉసిగొల్పుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
"""/" /
అలాగే రష్యాపై యుద్దం చేసేందుకు ఉక్రెయిన్ కు మారణాయుధాలు కూడా అమెరికా సరఫరా చేస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్ ను అడ్డుపెట్టుకుని రష్యాపై పరోక్షంగా యుద్దం చేస్తున్న అమెరికా.
ఇక ప్రత్యక్షంగా రష్యాపై దాడికి దిగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల అమెరికాకు సంబంధించిన యుద్ద విమానాన్ని సిరియాకు సంబంధించిన ఒక తీవ్రవాద వర్గం దాడి చేసి ధ్వంసం చేసింది.
ఆ దాడిలో 24 మంది గాయపడగా.ఆ దాడిని ప్రమాదంగా అమెరికా చెబుతోంది.
అయితే అది యాక్సిడెంట్ కాదని, దాడి అని తేలింది.అరబ్, చైనాతో, రష్యాలతో సిరియా ఒప్పందం చేసుకుందనే కారణంతో రష్యా ఆధ్వర్యంలో సిరియా( Russia ) ప్రభుత్వమే ఈ దాడి చేయించిందని అంటున్నారు.
"""/" /
అయితే అది గమనించి అమెరికా.ఇక రష్యాపై దాడికి సిద్దమైంది.
యుద్ద విమానాలను సిరియా వద్దకు పంపించింది.దాదాపు ఎఫ్ 22 రిఫ్టర్స్ ను పంపించింది.
ఈ ఫైటర్ జెట్ లను అమెరికా పంపించింది.దీంతో సిరియాలోని రష్యన్ పైలట్‌లు చాలాకాలం పాటు నుండి ఉన్న భద్రతా నియమాలను ఖండించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
సిరియా మీద రష్యా( Syria ) ఆధిపత్యం ఎక్కడ పోతుందోనని అమెరికా కొత్త ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు.
వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!