త్వరలో భారత్‌ కు జైకొవ్‌-డి కరోనా టీకా..!

భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వ్, బయోలాజికల్ ఇ నుండి వ్యాక్సిన్ లు అందుబాటులోకి వస్తుండగా కొత్తగా మరో వ్యాక్సిన్ రానుంది.

అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా కంపెనీ నుండి రూపొందించబడిన కరోనా వ్యాక్సిన్ జైకొవ్ డి ని వినియోగానికి డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంటున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మూడు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకున్నట్టు సమాచారం.ఈ ట్రయల్స్ లో 28 వేల మంది వాలంటీర్లను నియమించుకున్నారు.

ఈ వ్యాక్సిన్ పనితీరుపై నిఈతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.

పాల్ కూడా స్పందించడం జరిగింది.త్వరలో జకొవ్ డి అత్యవసర అనుమతి కోసం జైడస్ క్యాడిలా దరఖాస్తు చేసుకోబోతుందని ఆయన తెలిపారు.

ఈ వ్యాక్సిన్ కు ఒక స్పెషలిటీ ఉంది.ప్రపంచంలోనే ఇది తొలి డి.

ఎన్.ఏ వ్యాక్సిన్.

సంబందించిన అనుమతులు వస్తే ఆగస్టు, సెప్టెంబర్ మధ్య ఐదు కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని అందుబాటులోకి తెస్తామని జైడస్ క్యాడిలా ప్రకటించింది.

వయోజనులతో పాటుగా జైకొవ్ డి వ్యాక్సిన్ ను 12 నుండి 17 ఏళ్ల మధ్య పిల్లలపై కూడా పరీక్షిస్తున్నారని తెలుస్తుంది.

ఫలితాలను బట్టి డీసీజీఐ అనుమతిస్తే పిల్లలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేలా చేస్తారట.

ఇక ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే భారత్ లో నాలుగో కరోనా వ్యాక్సిన్ అవుతుంది.

జైడస్ క్యాడిలా నుండి వచ్చిన విరాఫిన్ డ్రగ్ ను కరోనా చికిత్స వినియోగించేందుకు డీసీజీఐ అనుమతించింది.

యూకేలో పెరిగిన అంత్యక్రియల ఖర్చులు.. ఎందుకో తెలిస్తే..