మరో అప్డేట్ ఇస్తున్న పుష్ప.. ఏమై ఉంటుందో?
TeluguStop.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
కాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, జనవరి 28న ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ అప్డేట్ దేని గురించి అనేది మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్‌గా ఉంచారు.
అయితే కేరళలో ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటుందేమో అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాను పూర్తి రివెంజ్ డ్రామాగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా మాస్ లుక్‌లో కనిపిస్తున్న బన్నీ, ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది.
మరి పుష్ప చిత్ర యూనిట్ నుండి రాబోతున్న అప్డేట్ ఏమై ఉంటుందనే విషయంపై చిత్ర వర్గాల్లో పలు రకాల వార్తలు వినిపిస్తుండటంతో మరోసారి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మేజర్ రాధికా సేన్‌కు అరుదైన గౌరవం .. ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించిన ఐక్యరాజ్యసమితి