గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో మరో ట్విస్ట్..!!

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ట్విస్ట్ నెలకొంది.విచారణలో భాగంగా స్కాం అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు విచారించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటకు వచ్చింది.జాయింట్ డైరెక్టర్ బినామీల ఖాతాల వివరాలను రికార్డుల్లోకి ఎక్కించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది.

మీ హెయిర్ రూట్స్ చాలా వీక్ గా ఉన్నాయా.. వర్రీ వద్దు ఇలా చేయండి!