ఢిల్లీ రెజ్లర్ల నిరసనలో మరో మలుపు..!!

ఢిల్లీలో నిర్వహిస్తున్న రెజ్లర్ల ఆందోళనలో సంచలన విషయం బయటకు వచ్చింది.డబ్ల్యూ ఎఫ్ఐ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపులు చేసిన మైనర్ తండ్రి మాట మార్చారని తెలుస్తోంది.

బ్రిజ్ భూషణ్ పై తప్పుడు ఆరోపణలు చేశామని మైనర్ తండ్రి చెప్పినట్లు సమాచారం.

బ్రిజ్ భూషణ్ తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడలేదన్న ఆయన బ్రిజ్ భూషణ్ వైఖరి కాస్త అసహజంగా మాత్రం ఉందని పేర్కొన్నారు.

ఆసియా ఛాంపియన్ షిప్ ట్రయల్స్ మిస్ కావడంతో కోపంతో ఆయనపై ఆరోపణలు చేశామని తెలిపారు.

ఈ క్రమంలోనే 5వ తేదీన ఢిల్లీ మేజిస్ట్రేట్ ముందు కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు.

అయితే ఫిర్యాదు వెనక్కి తీసుకోలేదని, కొత్త స్టేట్ మెంట్ ఇచ్చామని వెల్లడించారు.అయితే రెజ్లర్లు తాత్కాలికంగా నిరసనను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

హ్యాండ్‌స్టాండ్ ట్రిక్‌తో కళ్లముందే మాయం.. ఇదెలా చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!