తాజాగా టీడీపీని వీడనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు వీరే..!
TeluguStop.com
నేను తలచుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలను అని అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ అన్నారు.
ఇప్పుడా పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీ నుంచి లాగేసిన వైసీపీ.
ఇలా కనీసం మరో ఆరుగురిని ఆ పార్టీకి దూరంగా చేస్తే బాబు ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారు.
"""/"/దీంతో ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై కన్నేశారు.వాళ్లంతా ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్లే కావడం గమనార్హం.
ఈ జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.వీళ్లలో ముగ్గురితో ఇప్పటికే మంత్రులు బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడినట్లు సమాచారం.
చీరాల నుంచి కరణం బలరాం, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు.
టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. """/"/ఈ ముగ్గురినీ ఒకేసారి టీడీపీ నుంచి లాగడానికి వైసీపీ తనదైన రీతిలో ప్రయత్నిస్తోంది.
ఒత్తిళ్లకు తలొగ్గకపోతే వాళ్ల వ్యాపారాలపై దాడులు చేయడానికి కూడా మంత్రులు వెనుకాడటం లేదు.
ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన క్వారీలపై ఇలాంటి దాడులు మొదలయ్యాయి.ఈ ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.
వెంటనే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడారు. """/"/కొండపి ఎమ్మెల్యే స్వామి కూడా పార్టీ మారతారని వార్తలు వస్తున్నా.
ఆయనతో ఇప్పటి వరకూ ఏ మంత్రీ మాట్లాడలేదని సమాచారం.ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో తదుపరి చర్చలు జరిపే ముందు బుధవారం ముఖ్యమంత్రి జగన్‌తో ఆ మంత్రులు సమావేశం కాబోతున్నారు.