జోషిమఠ్‌లో మరో ఠాగూర్ సీన్..?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని.జోషిమఠ్ అనే ప్రాంతంలో భూమి రోజు రోజుకు కుంచించుకు పోతోంది.

దాంతో ఆగ్రామంలోని ఇళ్లు, బిల్డింగులు కొతకు గురవుతున్నాయి.అంతే కాకుండా పెద్ద పెద్ద బీటలు వాలుతున్నాయి.

దాంతో అప్రమత్తమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించారు.ఆ ప్రాంతాన్ని మూడు జోన్లుగా విడదీసి మరీ కూల్చివేతలకు అనుమతులిచ్చారు.

దాంతో పెద్ద పెద్ద కేన్ల సహాయంతో ప్రభుత్వం బిల్డింగులను కూల్చి వేస్తోంది.దానికంటే ముందే.

ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించి.ఎవరినీ అటువైపు పోకుండా ఆదేశాలిచ్చింది.

ఇంతవరకూ బాగానే ఉంది.కానీ ఇక్కడే ఒక నివేదిక సంచలనంగా మారింది.

జోషిమఠ్ టౌన్ ఏటా ఆరున్నర సెంటీ మీటర్లు కుంగిపోతోందని ఆ నివేదిక సారాంశం.

దాదాపు రెండున్నరేళ్ల పాటు.జరిగిన పరిశోదనల్లో.

ఉప గ్రహ చిత్రాలను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశామని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సైంటిస్టులు ప్రకటించారు.

భూమి లోపల గల టెక్టాని ప్లేట్లు కదలడంతోనే ఆ ప్రాంతంలో భూమి కుంచించుకు పోతోందని తెలిపారు.

"""/"/ అయితే ఈ నివేదికలో మరో విషయం వెలుగులోకి వచ్చింది.జోషిమఠ్ కు అత్యంత సమీపంలో స్టోన్ క్రషింగ్ పనులు జరుగుతున్నాయి.

జోషిమఠ్ కు దగ్గర్లో ఉన్న బద్రీనాథ్ కు వెళ్లే హైవే పక్కన ఈ స్టోన్ క్రషింగ్ పనులు జరుగుతున్నాయి.

అయితే వీటిని ఆపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.అయితే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా.

అర్ధరాత్రి పూట ఈ పనులు కొనసాగిస్తున్నారు.అంతే కాకుండా వీటి శబ్దం సుమారు ఒక కిలోమీటర్ల వరకూ వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

ఇంత జరుగుతున్నా.స్థానిక అధికారులు గానీ, ప్రజా సంఘాల నేతలు గానీ నోరు మెదపడం లేదు.

ఠాగూర్ సినిమాలో చూపించిన విధంగా క్రషింగ్ జరుగుతోందని.అందుకే భూమిలోని పొరలు కదిలి.

ఈ ప్రమాదం జరిగిందని పర్యావరణ వేత్తలతో పాటు నివేదిక కూడా కుండబద్దల గొట్టింది.

"""/"/ ఈ విషయాన్ని కావాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాస్తున్నాయని సోషల్ మీడియాలో విమర్శలు మొదలు అయ్యాయి.

దానికి తోడు ఆ ప్రాంతంలో ఎవరూ వెళ్లకుండా.స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు.

దాంతో మరిన్ని అనుమానాలు పెళ్లుబుకాయి.ఉపగ్రహ చాయా చిత్రాల ద్వారా నిజాలను నివేదిక వెల్లడించిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

ఎక్కిళ్ళు ఎందుకు వ‌స్తాయి.. వాటిని ఆప‌డం ఎలా..?