ఏపీకి మరో తుఫాను గండం..!

ఏపీకి మరో తుఫాను గండం పొంచి ఉంది.ఇటీవల బీభత్సం సృష్టించిన మిగ్జామ్ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ గండం పొంచి ఉంది.

"""/" / దీంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈనెల 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది 18వ తేదీన అల్పపీడనంగా మారనుందని ప్రకటించింది.ఈ అల్పపీడనం శ్రీలంక, తమిళనాడుతో పాటు ఏపీ వైపుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఈ అల్పపీడనం భారీ తుపానుగా మారనున్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి 25 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

వీడియో వైరల్: అయ్యబాబోయ్.. పావురానికి ఇలా కూడా ట్రైనింగ్ ఇస్తారా?