చరణ్ కోసం మరో స్టార్ హీరో.. ఎవరై ఉంటారో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు ఆచార్య చిత్రంలో కూడా చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత చరణ్ సోలోగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇటీవల చేశారు.

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాలో చరణ్‌తో పాటు మరో మెగా హీరో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోయే పాత్రలో ఓ స్టార్ హీరోను నటింపజేయాలని శంకర్ భావిస్తున్నాడట.

ఇక ఇప్పటికే శంకర్ ఆ స్టార్ హీరోను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడని తెలుస్తోంది.

మొత్తానికి చరణ్-శంకర్ కాంబోలో రాబోయే సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు పలువురు స్టార్ టెక్నీషియన్లు తీసుకోవాలని శంకర్ భావిస్తున్నాడట.

అయితే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా శంకర్ తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది.

మరి శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా, ఈ సినిమాలో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరా అనే అంశాలకు సమాధానం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు 2025 కలిసి వస్తుందా..?