మరో ఆరు నెలలు ఉచితం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

కరోనా కారణంగా దేశంలో నిరుపేదలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో "ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన" పేరిట ఉచిత రేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ పథకం ఈ నెలతో అయిపోయే పరిస్థితి ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు చేపట్టిన కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

విషయంలోకి వెళితే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దీంతో మరో ఆరు నెలల పాటు దేశంలో ఉచిత రేషన్ ఈ పథకం ద్వారా అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో దేశంలో 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.దేశంలో మహమ్మారి కరోనా కారణంగా.

ఉద్యోగాలు లేకపోవటం.అప్పట్లో ఉపాధి దొరకక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద.ఉచిత రేషన్ ఇవ్వడం జరిగింది.

కరోనా విస్తృతి నేపథ్యంలో ఎప్పటి కప్పుడు పొడిగిస్తూ.ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది.

అయితే ఈనెల ఆఖరితో ఈ పథకం ముగియనున్న నేపథ్యంలో.మరో ఆరు నెలలు పొడిగిస్తూ.

తాజాగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.