అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.కాలిఫోర్నియాలో ఆరెంజ్ కౌంటీలోని బైకర్స్ బార్ లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.

ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా ఆరుగురు గాయపడ్డారని తెలుస్తోంది.అమెరికా కాలమాన ప్రకారం బుధవారం రాత్రి సమయంలో కాల్పుల ఘటన జరిగింది.

కాల్పులకు తెగబడ్డ నిందితుడు రిటైర్డ్ పోలీస్ అధికారి అని అమెరికా మీడియా వెల్లడించింది.

తన భార్య దూరంగా పెడుతుందనే ఆగ్రహంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడని సమాచారం.

నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలోనే పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతం అయ్యాడు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements Pour Les Joueurs Français