వైసీపీకి మరో షాక్ .. మాజీ ఎంపీ అరెస్ట్ 

ఏపీలో అధికారానికి దూరం ఆయిన దగ్గర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress)పార్టీకి వరుస వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి .

ఇప్పటికే ఆ పార్టీలో  కీలక నేతలు అనుకున్న చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోగా, పార్టీలో కొనసాగుతున్న నేతలు ఎంతో మంది వివిధ కేసుల్లో విచారణలు ఎదుర్కుంటున్నారు.

ఇప్పటికే కొంతమంది అరెస్టు అయ్యి జైలుకూ వెళ్లారు.తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడు , బాపట్ల(Bapatla) మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పోలీసులు ఆరెస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో నందిగామ సురేష్ తో పాటు , మరికొంతమంది వైసీపీ నేతలపైన అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి.

"""/" / ఈ కేసులో ముందస్తు బె యిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో ఈరోజు నందిగామ సురేష్(nandigama Suresh) ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ మేరకు ఉద్దండ రాయుని పాలెం లోని ఆయన ఇంటికి.  తుళ్లూరు పోలీసులు వెళ్లారు.

దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు.  సురేష్ అక్కడ లేరని తెలియడంతో వెను తిరగారు.

అయితే తనను అరెస్ట్ చేయబోతున్నారనే ముందస్తు సమాచారంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి,  సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారట.

సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈరోజు ఉదయం నుంచి ఆయన కోసం వేట మొదలు పెట్టిన పోలీసులు అనేక కోణాల్లో ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు.

హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు.

"""/" / పక్కా సమాచారంతో సురేష్ ను అరెస్ట్ చేశారు.అనంతరం మంగళగిరికి తరలించారు.

ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వైసీపీ నేతలు చాలామంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

లేళ్ల అప్పిరెడ్డి ,దేవినేని అవినాష్ , తలశిల రఘురాం , నందిగాం సురేష్ ల కోసం గుంటూరు, బాపట్ల ,పలనాడు జిల్లాల పోలీసులతో కలిపి మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేశారు.

నందిగామ సురేష్ అరెస్టు వ్యవహారం పై వైసీపీ అధినేత జగన్ స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.

.

ప్రభాస్ 10 సంవత్సరాల వరకు నెంబర్ వన్ హీరోగానే కొనసాగబోతున్నాడా..?