టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం..
TeluguStop.com
టీ20 వరల్డ్ కప్ లో మరో సంచనం చోటుచేసుకుంది.గెలుపు అంచనాలు లేని కొత్త జట్లు ఈ మెగా టోర్నీలో బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి.
గురువారం రాత్రి ముగిసిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది.
జింబాబ్వే చేతిలో పాక్ ఓటమి పాలైంది.అది కూడా ఒకే ఒక్క పరుగు తేడాతో పాక్ ఓడిపోవడం గమనార్హం.
ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన జింబాబ్వే జట్టు మరో సంచలనాన్ని నమోదు చేసింది.
ముందుగా పాక్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ జింబాబ్వే బ్యాటర్లు.
20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ఇక 131 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది పాక్ .
ఇక చివరి దాకా పోరాటం చేసిన పాక్.తన ఇన్నింగ్స్ లో చివరి బంతికి ఒక్క పరుగు చేయలేక ఓడిపోయింది.
20 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సింగిల్ పరుగుతో జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోయింది.