ఏపీలో మరో సంచలనం ..ఆ లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం
TeluguStop.com
ఏపీలో వైసిపి( YCP ) అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతూనే ఉంది.
ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో సర్వేకు శ్రీకారం చుట్టింది.
ఏపీలో ప్రజల కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని పైన సర్వే చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
పది రోజుల్లోనే ఈ సర్వేను పూర్తి చేసే విధంగా విధి విధానాలను రూపొందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కుల, గ్రామీణ సర్వేలు( Caste Survey ) ప్రభుత్వం మొదలు పెట్టింది.
గ్రామ, వార్డు, సచివాలయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న కోటి 60 లక్షల కుటుంబాలను సర్వే చేయనున్నారు.
దీనికోసం వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణను అధికారులు ఇచ్చారు.ఎక్కడా ఎటువంటి వ్యక్తిగత డేటా బయటకు వెళ్ళకుండా, అత్యంత పగడ్బందీగా ఈ సర్వే చేపట్టే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇంటింటి సర్వేలో భాగంగా రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. """/" /
మొదటి దశలో గ్రామ, వార్డు వాలంటీర్లు ( Volunteers )వారికి ఇచ్చిన సి ఎఫ్ ఎమ్మెస్ లాగిన్ ద్వారా యాప్ లో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు.
ఆ కుటుంబం ప్రాథమిక వివరాలైన జిల్లా పేరు, మండలం, వార్డు, ఇంటి నెంబర్ వంటి వివరాలను తీసుకుంటారు.
ఆ తర్వాత కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ కార్డు నెంబర్, ఇంటి రకం , నీటి సౌకర్యం, గ్యాస్ సదుపాయం, పశు సంపద ఇలా అన్నిటి సమాచారాన్ని సేకరిస్తారు.
ఆ తరువాత సెక్షన్ లో కులం, మతం, వృత్తి, పంట భూమి, నివాస భూమి వంటి వివరాలను సేకరిస్తారు.
మొత్తం 723 కుటుంబాలకు సంబంధించి ఓసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలుగా విభజిస్తారు.
"""/" /
జనవరి 19 నుంచి 28 వరకు పది రోజులు పాటు వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేయించనున్నారు.
వాలంటీర్లు ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా అందుబాటులో లేకపోతే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది.
మొత్తం ఈ ప్రక్రియను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
జుట్టు రాలే సమస్యతో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి..!