Animal Husbandry Department : తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో కుంభకోణం
TeluguStop.com
తెలంగాణ పశుసంవర్ధక శాఖ( Animal Husbandry Department )లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం స్కాంలో విచారణ జరుగుతుండగానే ఆవుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఆవుల కొనుగోలులో మొత్తం రూ.3 కోట్ల అవినీతి జరిగిందని తెలుస్తోంది.
ఈ నిధులను కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాల్లోకి మళ్లించారని తెలుస్తోంది.
"""/" / అయితే 2022 లో రైతుల( Farmers ) కోసం అప్పటి ప్రభుత్వం పుంగనూరు ఆవులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇందుకోసం రూ.8 కోట్ల 50 లక్షల నిధులను విడుదల చేసింది.
పుంగనూరులో మొత్తం 12 మంది రైతుల నుంచి 1200 యూనిట్లను కొనుగోలు చేశారు.
కాగా ఆవులు అమ్మిన రైతుల అకౌంట్లలో కాంట్రాక్టర్లు కేవలం రూ.4 కోట్లు మాత్రమే జమ చేశారు.
మిగతా రూ.4 కోట్ల 50 లక్షలను బినామీ అకౌంట్లలోకి మళ్లించారు.
వ్యాపారులు నిలదీయడంతో అధికారులు రూ.కోటిన్నర ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఇంకా రూ.3 కోట్లు రావాలని పాడి రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ కుంభకోణంపై కూడా ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేయనుంది.కాగా గొర్రెల పంపిణీ పథకం( Sheep Distribution Scheme )లో నిధులు మళ్లించిన ముఠానే ఆవుల కొనుగోలులోనూ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
వైరల్ వీడియో: నడిరోడ్డుపై సింహాన్ని చుట్టేసిన కొండచిలువ