Sheep Scam : గొర్రెల పంపిణీ పథకంలో మరో కుంభకోణం..!!

తెలంగాణలో గతంలోని బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం( Sheep Distribution Scheme ) కుంభకోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

వీరి దర్యాప్తులో స్కీమ్ లోని మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ప్రభుత్వ పథకానికే గండి కొట్టేలా ‘లోలోన కంపెనీ’ అక్రమాలకు పాల్పడిందని అధికారులు గుర్తించారు.

"""/" / రైతులకు గొర్రెలు ఇప్పిస్తామని చెప్పిన లోలోన కంపెనీ సర్కార్ ( Lolona Company )ఆదాయానికి గండి కొట్టింది.

రూ.2.

10 లక్షలను పది మంది బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు ( ACB Officials )నిర్ధారించారని తెలుస్తోంది.

అదేవిధంగా లోలోన కంపెనీ ఎండీ పేరుపై ఏడు బోగస్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు.

కాగా లోలోన కంపెనీకి వెటర్నరీ శాఖ ఉన్నతాధికారి సహకరించారని దర్యాప్తులో వెల్లడైంది.అయితే ప్రస్తుతం లోలోన కంపెనీ ప్రతినిధులు పరారీలో ఉన్నారని సమాచారం.

ఇప్పటికే స్కాంపై నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

వైజయంతి మూవీస్ వారు పరిచయం చేసిన ప్రముఖ హీరో, హీరోయిన్స్ వీరే !