ఏపీలోని చింతూరులో మరో రెవెన్యూ డివిజన్
TeluguStop.com
ఏపీలోని చింతూరులో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది.ఈ మేరకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు.అదే క్రమంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది.
రాష్ట్రాన్ని 74 రెవెన్యూ డివిజన్లుగా విభజించింది.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 5 మండలాలతో ఓ కొత్త రెవన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది.
ఇప్పటివరకు డివిజన్ల సంఖ్య 73 ఉండగా.చింతూరు కేంద్రంగా ఏర్పాటైన కొత్త రెవెన్యూ డివిజన్ తో కలుపుకుని రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది.
జిల్లాలో ఇప్పటివరకు పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి.ప్రజల అభ్యర్థన మేరకు డిమాండ్లను పరిశీలించిన ప్రభుత్వం చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ప్రకటించింది.
ఈ రెవెన్యూ డివిజన్ తో 3 మండలాల ప్రజలకు పాలనా పరంగా భారీ ఊరట లభించనుంది.
వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!