మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. సౌత్ లో నెంబర్ 1..!

సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ నిలిచింది.మహేష్ ట్విట్టర్ ఖాతా 12 మిలియన్ ఫాలోవర్స్ ను క్రాస్ చేసింది.

సౌత్ సినీ ఇండస్ట్రీలో ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ మాత్రమే.

తెలుగు సినిమాలే చేస్తున్నా మహేష్ అంటే నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ ఏర్పడింది.

తమిళంలో కూడా మహేష్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.డైరెక్ట్ గా కన్నా మహేష్ సినిమాలు అక్కడ బాగా రీమేక్ అయ్యాయి.

ఆ విధంగా మహేష్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.ఘట్టమనేని నట వారసుడిగా మహేష్ తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

రాజకుమారుడు టు రాబోతున్న సర్కారు వారి పాట వరకు తన సినిమాలతో ఆడియెన్స్ ను అలరించడమే కాకుండా రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు మహేష్.

ఇక ట్విట్టర్ లో 12 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ మరోసారి తన స్టామినా ఏంటన్నది చూపించాడు.

మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశలో ఉంది.2022 ఏప్రిల్ 1న ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 మిగతా ఏ హీరో కూడా దరిదాపుల్లో కూడా లేని విధంగా మహేష్ ట్విట్టర్ ఫాలోయింగ్ ఉంది.

మహేష్ తర్వాత తమిళ హీరో ధనుష్ కి 10 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..