తెలంగాణలో మరో ప్రశ్న పత్రం లీక్..!!
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వరుస పెట్టి ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలు చెడ్డ పేరుని తీసుకొస్తున్నాయి.
TSPSC ప్రశ్నాపత్రం లీక్ గొడవ మరువకముందే నిన్న పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులపై బదిలీ వేటు కూడా వేయడం జరిగింది.
వికారాబాద్ జిల్లా( Vikarabad )లో ఈ ఘటన చోటుచేసుకుంది.పరిస్థితి ఇలా ఉంటే నేడు వరంగల్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న( Hindi Paper Leak ) పత్రం బయటకు రావటం సంచలనంగా మారింది.
పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ గ్రూప్ లలో హిందీ పేపర్ సర్క్యూలేట్ కావటం జరిగింది.
నిన్న వాట్సాప్ గ్రూప్ లో తెలుగు పేపర్( TELUGU Question Paper ) కూడా ఈరకంగానే సర్కులేట్ అయింది.
వరుసగా రెండో రోజు పదవ తరగతి పరీక్ష పేపర్ బయటకు రావడంపై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామంతో ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి SSC బోర్డు కార్యాలయం దగ్గర.భారీ భద్రత పెంచటం జరిగింది.
తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనలు ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి.
గేమ్ చేంజర్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పిన సెన్సార్ బోర్డు మెంబర్స్…ఆ రెండు సీన్లు ఫ్యాన్స్ కి కిక్కు ఇవ్వబోతున్నాయా..?