చంద్రబాబు పై సీఐడీ మరో పీటీ వారెంట్.. విచారణకు స్వీకరించిన ఏసీబీ న్యాయస్థానం..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu )పై సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

ఫైబర్ నెట్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ వేసిన పిటిషన్.

న్యాయస్థానం విచారణకు స్వీకరించడం జరిగింది.ఈ పిటిషన్ లో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది.

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్( AP Fibernet Scam ) లో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తూ ఉంది.

దాదాపు 121 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఉంది.2021లో ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించడం కూడా జరిగింది.అప్పటి ఎఫ్ఐఆర్ లో A1గా వేమూరి హరి ప్రసాద్, A2 మాజీ ఎంపీ సాంబశివరావు ఉన్నారు.

టెర్రసాఫ్ట్ కు అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపణ.ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail ) ఉండటం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి బెయిల్ తీసుకురావడానికి టీడీపీ లీగల్ టీం అదేవిధంగా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఇంతలోనే ఇప్పుడు మరో కేసు సీఐడీ నమోదు చేయటం సంచలనంగా మారింది.

ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?