కెనడాలో మరో విమాన ప్రమాదం.. ఆహాకారాలతో దద్దరిల్లిన విమానం (వైరల్ వీడియో)
TeluguStop.com
దక్షిణ కొరియా విమాన ప్రమాదం తర్వాత మరో విమాన ప్రమాదం జరిగింది.హాలిఫాక్స్ విమానాశ్రయంలో కెనడియన్ ఎయిర్‌లైన్స్ విమానం( Canadian Airlines Plane At Halifax Airport ) ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ సమాచారం లేదు.మీడియా నివేదికల ప్రకారం, PAL ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం (AC2259) సెయింట్ జాన్స్ నుండి బయలుదేరింది.
హాలిఫాక్స్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత రన్‌వే నుంచి జారిపోయింది. """/" / ఆ సమయంలో ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదం తర్వాత విమానాశ్రయం ప్రస్తుతం మూసివేయబడింది.ప్రస్తుతానికి, ఈ విమానంలో ఎంత మంది ఉన్నారనే దానిపై అధికారిక సమాచారం ఇంకా తెలియ రాలేదు.
ఇక ప్రమాదం జరుగుతున్న సమయంలో లోపల ఉన్న ప్రయాణికులు ఆహాకారాలతో గట్టిగా అరిచారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/" /
అయితే, విమానం పూర్తిగా నిండిపోయిందని రక్షించిన ఓ ప్రయాణికుడు తెలిపారు.
ఈ విమానం 80 మంది ప్రయాణికులు( 80 Passengers ) కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ విమానం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో( Muan International Airport ) ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే జరిగింది.
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో విమానంలోని మొత్తం 179 మంది మరణించారు.దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదంలో181 మందితో ప్రయాణిస్తున్న విమానం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో, విమానంలో ఉన్న మొత్తం 179 మంది మరణించగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 6 మంది సిబ్బంది, 175 మంది ప్రయాణికులు ఉన్నారు.
జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాకు తిరిగి వస్తోంది.
మెడ తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!