విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్..!!
TeluguStop.com
విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు టీడీపీ నేత నారా లోకేశ్ కు ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని సీఐడీ కోర్టును కోరింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ పై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇదే కేసులో లోకేశ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో 41 ఏ నోటీస్ ఇచ్చిన తరువాత విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నారా లోకేశ్ కు ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ అవగా ఈ కేసులో ఎన్బీడబ్ల్యూ జారీ చేయాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
కాగా సీఐడీ దాఖలు చేసిన ఈ పిటిషన్ మరికాసేపటిలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
వైరల్ వీడియో: అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్