హైదరాబాద్‎లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్ట్

హైదరాబాద్‎లో పేలుళ్లకు ఉగ్రకుట్ర కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.పాతబస్తీకి చెందిన ఎండీ అబ్దుల్ కలీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హ్యాండ్ గ్రనేడ్ల కేసులో జాహిద్, షారుఖ్, సమియుద్దీన్ అరెస్ట్ అయ్యారు.

వీరంతా చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.జాహిద్ కు అబ్దుల్ కలీమ్ రూ.

40 లక్షలు నగదును సమకూర్చినట్లు గుర్తించారు.పేలుళ్లకు కుట్ర పన్నిన గ్యాంగ్ ముందుగా పాకిస్థాన్ నుంచి మనోహరాబాద్ కు హ్యాండ్ గ్రనేడ్లను తరలించారు.

అక్కడి నుంచి జాహిద్ గ్యాంగ్ ఆ గ్రనేడ్లను హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ సమయంలోనే నిందితుల నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్లతో పాటు రూ.5.

4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?