గూగుల్ మరో సరికొత్త ఫీచర్.. పిల్లలు ఏం చదువుతున్నారో ట్రాక్ చేయవచ్చు..
TeluguStop.com
టెక్ దిగ్గజం గూగుల్ ( Google )ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది.
అందులో భాగంగా తాజాగా గూగుల్ ప్లే బుక్స్ అప్లికేషన్‌లో( Google Play Books Application ) సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పిల్లల కోసం ప్లే బుక్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను గతంలో గూగుల్ తీసుకొచ్చింది.తాజాగా ఇందులో రీడింగ్ ప్రాక్టీస్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ద్వారా పిల్లలు ఏదైనా పుస్తకం చదివేటప్పుడు అందులో ఏదైనా కష్టమైన పదం పలకడం రాకపోతే.
దానిని ఎలా పలకాలో రీడింగ్ ప్రాక్టీస్ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.అలాగే పుస్తకం ఎక్కడ వరకు చదివారనే వివరాలను కూడా ట్రాక్ చేయవచ్చు.
"""/" /
పిల్లలకు ఏదైనా పదం అర్ధం కానప్పుడు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
దీని వల్ల పిల్లలు తాము చదివే పుస్తకాన్ని పూర్తిగా అర్దం చేసుకోగలరు.అలాగే పిల్లలు ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు పొరపాటున పేరాగ్రాఫ్( Paragraph ) నుంచి చాలా దూరం వచ్చినట్లయితే ట్రాకింగ్ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌తో మళ్లీ వెనక్కి వెళ్లవచ్చు.
పిల్లలు తాము చదువుకున్న పుస్తకాన్ని ఎక్కడి వరకు కవర్ చేశారనేది ఈ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చదువుతున్నారనే విషయాన్ని ఈ ట్రాకింగ్ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.
"""/" /
అలాగే గూగుల్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.ఏదైనా ఫొటోలో మనకు అవసరం లేని వ్యక్తులు లేదా పరికరాలను తొలగించుకోవచ్చు.
దీని కోసం మ్యాజిక్ ఎరేజర్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.మనం ఎక్కడైనా బయట ఫొటో దిగేటప్పుడు సంబంధం లేని వ్యక్తులు ఫొటోలో పడుతూ ఉంటారు.
ఇలాంటి సమయాల్లో ఈ ఫీచర్ ద్వారా సులువుగా వారిని ఫొటో నుంచి తొలగించుకోవచ్చు.
అలాగే అబ్జెక్టులను కూడా తొలగించుకోవచ్చని గూగుల్ చెబుతోంది.గతంలో లేటెస్ట్ ఫిక్సల్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉండగా.
పాత ఫిక్సెల్ ఫోన్లలో కూడా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?