వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక నెంబర్ కనిపించకుండా చేసుకోవచ్చు..

ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్( Whatsapp ) ఎప్పుడు ఏదోక ఫీచర్‌ను కొత్తగా తీసుకొస్తూ ఉంటుంది.

యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది.అందులో భాగంగా వాట్సప్ మరో నయా ఫీచర్‌ను అతి త్వరలో తీసుకురానుంది.

ఆ ఫీచర్ పేరే ఫోన్ నెంబర్ ప్రైవసీ.ఈ ఫీచర్ ద్వారా మన వాట్సప్ నెంబర్ ఇతరులకు కనిపించకుండా ఆఫ్ చేసుకోవచ్చు, యూజర్ల భద్రత, ప్రైవసీ కోసం వాట్సప్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తుంది.

"""/" / చాలామంది ఆగంతకులు వాట్సప్ నెంబర్లు సేకరించి వారి పేర్లు, స్టేటస్ లు ఆధారంగా వారి ఇష్టాలు తెలుసుకుని మార్కెటింగ్ కంపెనీలకు చేరవేస్తున్నారు.

అలాగే నెంబర్లు ఓపెన్ గా కనిపించడం వల్ల సైబర్ నేరాలు, హ్యాకింగ్ కు పాల్పడేవారికి కూడా సులువవుతుంది.

దీంతో యూజర్లకు భద్రత కల్పించేందుకు ఈ ఫోన్ నెంబర్ ప్రైవసీ ఫీచర్( Phone Number Privacy Feature ) ను త్వరలో వాట్సప్ తీసుకురానుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐ ఫోన్లలో కూడా ఈ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.

అయితే ఈ ఫీచర్ గురించిన వివరాలను ఇంకా వాట్సప్ అధికారికంగా ప్రకటించలేదు. """/" / కానీ వాట్సప్ తీసుకొచ్చే ఫీచర్లు, వివరాల కోసం ఎప్పటికప్పుడు వివరాలు అందించే వీఏబీఇన్పో వెబ్ సైట్ సరికొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.

అయితే ఈ ఫీచర్‌ను కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించుకోగలరు.అయితే కమ్యూనిటీ అడ్మిన్( Community Admin ) కు ఈ ఫీచర్ పనిచేయదు.

అడ్మిన్ నెంబర్ అందరికీ కనిపిస్తుంది.కమ్యూనిటీ గ్రూపులోని సభ్యులు ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇతరులకు మీ నెంబర్ కనిపించదు.

జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

బలగం వేణుకి హీరో దొరికాడా..? నాని హ్యాండ్ ఇచ్చిన కూడా ఆ కుర్ర హీరోను సెట్ చేశాడా..?