వైసిపి ఓటమికి నెల్లూరు జిల్లా నాంది పలకనుందా?

రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఒకటిగా నెల్లూరు జిల్లాకు( Nellore District ) పేరు.

ఇ క్కడ అత్యధిక సీట్ల గెలుచుకున్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఒక సెంటిమెంట్ కూడా ఉంది .

దానికి తగ్గట్లే గత ఎన్నికల్లో పదికి పది ఎంఎల్ఏ సీట్లు గెలుచుకున్న వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది .

అయితే ఇప్పుడు అదే జిల్లా వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది.ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబాటు చేయగా ఇప్పుడు ఆ దారిలో మరొక ఎమ్మెల్యే కూడా పార్టీని విడబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది .

ఆయన మరెవరో కాదు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి( Nallapureddy Prasannakumar Reddy ) తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న ఆయన తెలుగుదేశం ద్వారా పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

ఆ తరువాత ఆ పార్టీతో విభేదాల నడుమ 2009లో రాజీనామా చేసి జగన్ ( CM Jagan ) వెంట నడిచారు.

"""/" / ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగినా కూడా సామాజిక సమీకరణాలలో భాగంగా పార్టీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపించింది .

మలి విడత విస్తరణ లో కూడా ఆయనకు అదృష్టం తగల్లేదు .

అప్పటినుంచి పార్టీపై అసంతృప్తి తో ఉన్న ఆయనకు పార్టీ ఆయన పట్ల వ్యవహరిస్తున్న విధానం కూడా నచ్చడం లేదట.

రాబోయే ఎన్నికల్లో ఆయనకు ఇప్పటివరకు సీటు విషయంలో వైసీపీ అధిష్టానం ఏ రకమైన హామీ ఇవ్వలేదట.

ఇవన్నీ బేరీజు వేసుకుని చూస్తే ఆయన పార్టీ మారడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ముందు నుంచి పార్టీతో నడిచిన తనలాంటి విదేయులను పక్కనపెట్టి మధ్యలో వచ్చిన కొంతమందికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని , """/" / అందువల్ల పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే తెలుగుదేశంలో సఖ్యత లేని కారణంగా ఆ పార్టీలో చేరడానికి కూడా ఆయన ఇష్టపడటం లేదట.

జనసేన పార్టీలోకి చేరాలని అనుకున్నా తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా తనకు సీటు కన్ఫర్మ్ అవుతుందన్న ఆశ కూడా ఆయనకి లేదని ,తద్వారా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత పార్టీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని ఆయన ఆలోచన చేస్తున్నారని విశ్లేషణ లు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఒక జిల్లా కు సంబందించి మెజారిటీ నేతలు పార్టీకి దూరం కావడం శుభ పరిణామం కాదు .

మరి ఈ విషయం లో వైసీపీ అధిష్టానం ఏ రకమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో మళ్లీ జిల్లాలో గెలవడానికి ఏ రకమైన ప్రణాళికలు రచిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

టెక్సాస్‌ : చరిత్రలో నిలిచిపోయేలా దీపావళి వేడుకలు .. తొలిసారిగా బాణాసంచాకు అనుమతి