తేజ, రానా కాంబో లో వస్తున్న మరో సినిమా…ఈ సినిమా కథ ఇదే..?

హీరో రానా దగ్గుబాటి డైరెక్టర్ తేజ( Teja ) కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

హీరోగా రానా దగ్గుబాటి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఆ సినిమా నిలిచింది.

అందులో జోగేంద్ర పాత్రలో రానా నటన అందరినీ మెప్పించింది.అలాగే ఆయన భార్యగా చేసిన కాజల్ అగర్వాల్ పాత్ర కూడా సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది.

ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

మరోసారి హీరో రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

‘నేనే రాజు నేనే మంత్రి( Nene Raju Nene Mantri )’ సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రను మించి.

మరింత బలంగా ఈ సినిమాలో రానా పాత్ర ఉండబోతోందని మేకర్స్ అంటున్నారు.పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తేజ తీర్చిదిద్దబోతున్నారట.

మరి ఇందులో రానా జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.

ఓ మలయాళ స్టార్ హీరో మాత్రం ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

అలాగే ఈ కథ గురించి తెలుసుకుంటే రాజకీయం ప్రదానం గా సాగే ఈ కథ లో హీరో క్యారెక్టర్ మాత్రం చాలా అద్బుతం గా ఉంటుందని తేజ అంటున్నారు.

"""/" / ఇక సినిమాను నందమూరి బాలకృష్ణ హీరోగా టాప్ హీరో, దేవుడు.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడి పంబ, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను త్వరలోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్( Bheemla Nayak ) సినిమాలో డానియేల్ శేఖర్ గా రానా నాయుడు తన విశ్వరూపం చూపించాడు.

"""/" / భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ రాకపోయినా ఆ సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన రానా కూడా మాత్రం మంచి పేరు వచ్చింది.

అదే విధంగా రానా నాయుడు అనే వెబ్ సీరిస్ లో వెంకటేష్ తో కలిసి నటించి అనేక విమర్శలను ఎదుర్కోన విషయం తెలిసింది.

అయిన ఆ సిరీస్ హిట్ అవ్వటంతో ఆ విమర్శలకు తావులేకుండపోయింది.మళ్ళీ అంత డైనమిక్ పాత్రలో నటించబోతున్న పాత్ర కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

వైరల్ వీడియో: అందరిముందే ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు.. చివరికి సర్‌ప్రైజ్..