తెలంగాణ కోసం మరో ఉద్యమం..!!
TeluguStop.com
తెలంగాణ కోసం మరో ఉద్యమానికి విద్యార్థులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు చేసే ఉద్యమానికి బీజేపీ మద్ధతు ఉంటుందని తెలిపారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితులను పట్టుకోకుండా తమకు నోటీసులు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వరని ప్రశ్నించారు.తప్పు చేసిన టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఇంత వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదన్న ఆయన షాడో సీఎంగా కేటీఆర్ వ్యవహారిస్తున్నారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఒక్క స్కాం కూడా లేదని చెప్పారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ప్రతి ఒక్కటి స్కామేనని మండిపడ్డారు.
వైరల్: రోడ్డుపై బైక్ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?