తెలంగాణలో తప్పిన మరో ఉపఎన్నిక గండం..!

తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పినట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది.

అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది.

దీంతో ఉప ఎన్నిక ఉండదని తెలుస్తోంది.కాగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉన్న సంగతి తెలిసిందే.

ఏడాది లోపు ఉంటే బై పోల్ జరిగే అవకాశం లేదని ఈసీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు 2019 జనవరి 17వ తేదీన ఎమ్మెల్యేగా సాయన్న ప్రమాణస్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం తేదీ ప్రకారం ఏడాది లోపు ఎన్నికలు ఉంటే ఉపఎన్నికలు ఉండవని ఈసీ పేర్కొంది.

ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీలన్నీ కంటోన్మెంట్ ను రెఫరెండంగా భావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీంతో ఉపఎన్నిక జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రజల్లోకి రారు పార్టీని పట్టించుకోరు ఇలా అయితే ఎలా కేసీఆర్