మరో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

ఈ క్రమంలోనే అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి మరియు కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.అదేవిధంగా తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది.

ఈనెల 24 తరువాత మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వెల్లడించింది.

వాటే ఐడియా గురూ.. కొడుకుకి “వన్ టు సిక్స్”పేరు పెట్టిన తండ్రి.. ఎందుకంటే?