సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ

సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు.సీబీఐ వెబ్ సైట్ లో ఉంచిన ఎఫ్ఐఆర్ ను పరిశీలించినట్లు తెలిపారు.

ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదన్నారు.ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రేపు వివరణ ఇవ్వలేనని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఏ రోజు వివరణ తీసుకుంటారో ఖరారు చేయాలని సీబీఐను కవిత లేఖలో కోరారు.

తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినన్న ఆమె దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు.

యంగ్ హీరో విశాల్ రత్నం మూవీ సెన్సార్ రివ్యూ.. ఈ సినిమా టాక్ ఏంటంటే?