బీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.తరువాత బీఆర్ఎస్( BRS ) నుంచి పెద్ద ఎత్తున వలసలు ఊపందుకున్నాయి.
బీఆర్ఎస్ కు ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ,మాజీ ఎమ్మెల్యేలు , ఎంపీలు ఇలా ఎంతోమంది రాజీనామా చేశారు.
ఇక జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వేలాది మంది ఇప్పటికే బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్, బిజెపిలలో( Congress And BJP ) చేరిపోయారు.
ఆ వలసలను నివారించేందుకు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వలసలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుకునేందుకు, మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు.
"""/" /
వలసలను నివారించేందుకు పార్టీకి చెందిన కొంత మంది కీలక నేతలకు బాధ్యతలను అప్పగించినా, ఫలితం మాత్రం కనిపించడం లేదు .
తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ( Former MLA Bheti Subhash Reddy ) టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
త్వరలోనే ఆయన బీజేపీ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా కొత్తగా చేరిన లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు.
మల్కాజ్ గిరి లో బిజెపి నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నట్లుగా తాజాగా ఆయన ప్రకటించారు.
"""/" /
దీంతో ఆయన బీ ఆర్ఎస్ పార్టీని వీడుతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది .
ఈయనే కాకుండా ఇంకా అనేకమంది నేతలు బీ ఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధం అవుతుండడం ,ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తుండడంతో బీ ఆర్ ఎస్ ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
అయితే ఈ వలసల కారణంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయము బీఆర్ఎస్ పెద్దలో స్పష్టంగా కనిపిస్తోంది.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు