హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మరో కీచక టీచర్

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో మరో కీచక టీచర్ వ్యవహారం బయటకు వచ్చింది.

కాటేదాన్ లోని ఓ పాఠశాలలోని విద్యార్థినీల పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

పదో తరగతి విద్యార్థినీల పట్ల ప్రిన్సిపల్ గుర్రం శంకర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు తల్లిదండ్రులకు చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ తానేమి అలా చేయలేదని చెప్పినట్లు తెలుస్తోంది.దీంతో బాధిత తల్లిదండ్రులు కీచక టీచర్ పై షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

24 గంటలు బెగ్గింగ్ ఛాలంజ్.. చివరకు? (వీడియో)