హైదరాబాద్ లో వెలుగులోకి మరో ఇన్వెస్టిమెంట్ స్కామ్
TeluguStop.com
హైదరాబాద్ లో మరో ఇన్వెస్టిమెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్ భారీ మోసానికి పాల్పడిన కేటుగాళ్లు కోట్లు దండుకున్నారు.
సినిమాల్లో పెట్టుబడుల పేరుతో దాదాపు 30 మంది నుంచి రూ.6 కోట్లు వసూలు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి ఉద్యోగులకు టోకరా వేశారని సమాచారం, కూకట్ పల్లికి చెందిన అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్ లు మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ సీసీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు.నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
లండన్: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!