ఏపీలో మరో ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం( Andhra Pradesh )లో వరుసగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి.

బుధవారం ఫలితాలు విడుదల చేయగా.గురువారం నాటికి ఫెయిల్ అయినా విద్యార్థులు నలుగురు మృతి చెందడం జరిగింది.

విశాఖపట్నం అదే విధంగా శ్రీకాకుళం జిల్లా( Srikakulam District )లకు చెందిన విద్యార్థులు మృతి చెందారు.

తాజాగా కృష్ణాజిల్లా తాడిగడపలోని ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజ్ హాస్టల్ లో దారుణం జరిగింది.

వాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.ఇంటర్ ఫెయిల్ అయ్యావంటూ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు తిట్టారనే మనస్థాపంతో వాణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో ఈ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు.

దీంతో కాలేజీ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.వాణి డైరీలో కొన్ని పేజీలు చించి ఉండటంతో తమకి అనుమానాలు ఉన్నాయని వారు చెబుతున్నారు.

ఈ రకంగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అవమానాన్ని తట్టుకోలేక.ఫెయిల్ అయిన బాధతో బలవన్మరణాలకు( Suicide ) పాల్పడుతున్నారు.

వరుసలో ఇటువంటి ఘటనలు ఎక్కువవుతూ ఉండటంతో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

వాణి మరణంతో కలిపి ఏపిలో ఇంటర్ ఫెయిల్ అయ్యి అవమానం తట్టుకోలేక మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్లు లెక్కలు చెబుతున్నాయి.

రజినీకాంత్ వేట్టయన్ ఓటిటి లో అదరగొడుతుందా..?