తెలంగాణకు మరో భారీ వర్ష సూచన
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ మేరకు రేపటి నుంచి సుమారు నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
24వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్న క్రమంలో 25 వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అదేవిధంగా వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!