నల్లమల్ల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది.అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో మంటలు భారీగా చెలరేగాయి.

దాదాపు రెండు హెక్టార్లలో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా మూడు రోజుల క్రితమే ఐదు హెక్టార్లలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.